సోంపేట: యువత డ్రగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి: డీఐజీ
సోంపేట పోలీస్ స్టేషన్లో గురువారం సాయంత్రం విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ క్రైమ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు అందించారు. రాష్ట్రంలో గంజాయి పంటను పూర్తిగా నిషేధించినప్పటికీ, పక్క రాష్ట్రమైన ఒడిశా నుంచి అక్రమ రవాణా సాగుతోందన్నారు. గంజాయి, డ్రగ్స్ పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఆయనతోపాటు ఎస్పి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు.