నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
శ్రీకాకుళం గ్రామీణ మండలం కనుగులవానిపేట ఉప కేంద్రం పరిధిలో ఆర్డీఎస్ఎస్ పనులు నిమిత్తం గురువారం ఉదయం 9: 30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ ఎస్. బయ్యనాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కనుగులవానిపేట, ఇప్పిలి, బలివాడ, కుందువానిపేట, ముక్తంపాలెం, గొల్లపేట, పరదేశిపాలెం తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.