Feb 17, 2025, 01:02 IST/కరీంనగర్
కరీంనగర్
మాల మహానాడు రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా మంజుల
Feb 17, 2025, 01:02 IST
మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా నాలుగోసారి యనమాల మంజుల నియామకమయ్యారు. వి. ఎల్. రాజు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశాల మేరకు నియామక పత్రాలను దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు కృష్ణ స్వరూప్ కరీంనగర్లో ఆదివారం అందించారు. తన నియామకం పట్ల సహకరించిన మాల మహానాడు నాయకులకు మంజుల కృతజ్ఞతలు తెలిపారు.