Nov 26, 2024, 04:11 IST/మంథని
మంథని
నేడు పెద్దపల్లికి కొండా సురేఖ రాక
Nov 26, 2024, 04:11 IST
దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖతోపాటు మంత్రులు మంగళవారం పెద్దపల్లి మండలం సబ్బితంకి రానున్నట్లు ఎండోమెంట్ అధికారులు తెలిపారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలరావు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే విజయరమణ రావులు ఉదయం 11గంటలకు రూ. 50లక్షల సిజిఎఫ్ నిధులతో చేపట్టనున్న శ్రీ సీతారామాంజనేయస్వామి దేవస్థాన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు.