విద్యుత్ కొనుగోలు అగ్రిమెంట్ వ్యవహారంలో అమెరికాలో గౌతమ్ అదానీతో పాటు ఆయన సన్నిహితులపై కేసు నమోదైంది. ఇందులో వైసీపీ అధినేత జగన్ పేరు కూడా పేర్కొంది. రూ.1,750 కోట్లు లంచం తీసుకున్నట్లు సమాచారం. జగన్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. జగన్ మీద యాక్షన్ తీసుకోవడానికి సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఒకవేళ ఏపీలో జగన్‌పై కేసు పెడితే సెకీ కార్నర్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఏపీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది కీలకంగా మారింది.