
కుప్పం: ఉచితంగా పాలిసెట్ కోర్స్ ట్రైనింగ్
కుప్పం మోడల్ కాలనీలో ఉన్న డాక్టర్ వైసీ జేమ్స్ ఇన్ రూరల్ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష రాసే విద్యార్ధులకు ఉచిత శిక్షణ ఇస్తామని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ జగన్నాథ్ రావు మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 3 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. రోజు ఉదయం 9: 30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శిక్షణ తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. శిక్షణకు అవసరమైన పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందజేస్తామని తెలిపారు.