VIDEO: ఎర్ర సముద్రంలో బోటు ప్రమాదం..16 మంది గల్లంతు

588చూసినవారు
ఎర్ర సముద్రంలో ప్రమాదవశాత్తూ టూరిస్టు బోటు మునిగి 16 మంది గల్లంతయ్యారు. ఈజిప్టు తీరానికి దగ్గరలో ఒక్కసారిగా అల బలంగా వచ్చి ఢీకొట్టడంతో బోటు సముద్రంలో మునిగిపోయినట్లు అధికారులు తెలిపారు. మునిగిపోయినపుడు బోటులో మొత్తం 44 మంది ఉన్నారు. వీరిలో 31 మంది టూరిస్టులు కాగా, 13 మంది సిబ్బంది. ప్రమాదం నుంచి 28 మందిని కాపాడినట్లు రెడ్‌సీ గవర్నరేట్‌ వెల్లడించింది. కొంతమంది క్యాబిన్లలో ఉండడం వల్ల తప్పించుకోలేకపోయారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్