యాదమరి మండలంలోని మోర్దానపల్లి గంగమ్మ ఆలయంలో హుండీని కొంతమంది దొంగలు అపహరించినట్లు స్థానికులు ఆదివారం తెలిపారు. ఈ మేరకు వారు హుండీని వెతకగా చెరువు వద్ద పగలగొట్టి ఉందని, అందులో ఉన్న మొత్తం నగదును తీసుకెళ్లినట్లు గుర్తించారు. హుండీలో సుమారు రూ. 3 లక్షలు ఉండవచ్చని పేర్కొన్నారు. వెంటనే నిందితులను పట్టుకోవాలని స్థానికులు కోరారు.