హానీ రోజ్ కేసులో కేరళ బిజినెస్‌మ్యాన్ అరెస్ట్
సినీ నటి హనీ రోజ్పై వేధింపుల కేసులో కేరళకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్‌ను సిట్ అధికారులు వయనాడ్‌లో అదుపులోకి తీసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో తనపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని నటి హనీ రోజ్ ఎర్నాకుళం PSలో చేసిన ఫిర్యాదు చేశారు. ఆ మేరకు బాబీని అరెస్టు చేసినట్లు అధికారులు చెప్పారు. అతడిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.