మేనకోడలు ఇష్టమైన వ్యక్తితో పారిపోయి పెళ్లి చేసుకొందన్న ఆవేదనతో ఓ మేనమామ విందుభోజనంలో విషం కలిపాడు. మహారాష్ట్రలోని కొల్హాపుర్ జిల్లా ఉట్రే గ్రామంలోని మేనమామ మహేశ్ పాటిల్ ఇంట్లో పెరిగిన ఆ యువతి తమ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లిచేసుకుంది. కుటుంబసభ్యులు అయిష్టంగానే ఆ జంటను ఆశీర్వదించి రిసెప్షను ఏర్పాటు చేశారు. మేనమామ అతిథుల కోసం సిద్ధం చేస్తున్న భోజనాల్లో విషం కలిపాడు. అది చూసిన కొందరు నిలదీయడంతో అక్కడి నుంచి పారిపోయాడు.