ప్రముఖ నిర్మాత, రచయిత ప్రితీశ్ నంది(73) కన్నుమూశారు. జర్నలిస్ట్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ప్రితీశ్ రచయితగా, నిర్మాతగా తన కంటూ గుర్తింపు సంపాదించుకున్నారు. గతంలో రాజ్యసభ ఎంపీగా కూడా వ్యవహరించారు. ప్రితీశ్.. ఝంకార్ బీట్స్, చమేలీ, హజారోన్ ఖ్వైషీన్ ఐసీ, ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్, మీరాబాయ్ నాటౌట్ వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇంకో వారం రోజుల్లో తన 74వ పుట్టిన రోజు ఉంది. ఇంతలోనే ఆయన అనారోగ్యంతో మృతి చెందారు.