TG: చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను రెండు రోజుల క్రితం ప్రధాని మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు సికింద్రాబాద్ నుంచి మొదలయ్యే పలు రైళ్లు ఇకపై చర్లపల్లి నుంచి స్టార్ట్ కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్ టు చర్లపల్లికి ప్రతి 10ని. ఒక బస్సు ఉంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, HPCL మీదుగా అక్కడికి చేరుతాయని పేర్కొన్నారు.