ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి (వీడియో)

58చూసినవారు
అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆలమూరు-మండపేట రోడ్డుపై ట్రక్కు.. ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. వెనుక నుంచి వస్తున్న బైక్ కూడా ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.