‘యుద్ధం ఆపితే సంధికి సిద్ధమే’

74చూసినవారు
‘యుద్ధం ఆపితే సంధికి సిద్ధమే’
రఫా, గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఆపేస్తే తాము సంధికి సిద్ధమేనని కాల్పుల విరమణ చర్చల మధ్యవర్తులకు తెలియజేసినట్లు హమాస్ ప్రకటించింది. బందీల మార్పిడితో పాటు పూర్తిగా కాల్పుల విరమణ ఒప్పందానికి తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది. కాగా దక్షిణ గాజా స్ట్రిప్ నగరంలో ఇజ్రాయెల్ దాడులు చేయడంతో 35 మంది మరణించినట్లు పాలస్తీనా అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్