గజపతినగరం: రోడ్డు ప్రమాదంలో బాలుడికి తీవ్ర గాయాలు
దత్తిరాజేరు మండలంలోని షికారుగంజి జంక్షన్ వద్ద హైవేపై సోమవారం లారీ, బస్సు ఢీకొన్న సంఘటనలో మహేశ్ అనే పదేళ్ల బాలుడి చెయ్యి తెగిపడింది. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది హుటాహుటికి సంఘటనా స్థలానికి చేరుకుని బాలున్ని ప్రథమ చికిత్స అందించి జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్నారు. అదేవిధంగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.