ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ జిల్లాలో ఓ జర్నలిస్టు దారుణ హత్యకు గురైన ఉదంతం గురువారం వెలుగులోకి వచ్చింది. కొందరు దుండగులు చిన్న వివాదం కారణంగా జర్నలిస్టు దిలీప్ సైనీని కత్తులు, పదునైన ఆయుధాలతో దాడి చేసి చంపేశారు. ఈ ఘటన బుధవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ తెగ అవుతోంది.