తోక లేని దూడ జననం
దత్తిరాజేరు మండలం పాపయ్యవలసలో గురువారం విచిత్రమైన ఆవు దూడ జన్మించింది. గేదెల రవికి చెందిన ఆవు తోక లేని దూడకు జన్మనిచ్చింది. ఆవు దూడ ఆరోగ్యంగా ఉందని యజమాని తెలిపారు. వింత ఆవు దూడ జన్మించిందని తెలియగానే స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు అక్కడికి తరలివచ్చి ఆశ్చర్యంగా తిలకిస్తున్నారు.