రావివలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ
గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కె. విజయ పార్వతి సూచించారు. బుధవారం గరుగుబిల్లి మండలం రావివలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గర్భిణుల ఆరోగ్యం, సురక్షిత ప్రసవమే లక్ష్యంగా కృషి చేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రసవాల సంఖ్య పెంచాలని ఆదేశించారు. అనంతరం వ్యాక్సిన్ నిల్వలతో పాటు పలు రికార్డులను పరిశీలించారు.