Oct 14, 2024, 16:10 IST/ముథోల్
ముథోల్
భైంసాలో ఘనంగా ధమ్మ దీక్ష కార్యక్రమం
Oct 14, 2024, 16:10 IST
భైంసా పట్టణంలో 68వ ధమ్మచక్ర ప్రవర్తన దినోత్సవం పురస్కరించుకుని సోమవారం ధమ్మ గురువులచే ధమ్మ దీక్ష కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీబీస్ఐ ట్రస్టీ ఛైర్మెన్ చంద్ర బోధి పాటిల్ పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి ఒక్కరు బుద్ధుని మార్గంలో నడవాలని సూచించారు. బీబీస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు నీలం ప్రభాకర్, జనరల్ సెక్రటరీ మురళీ తదితరులు పాల్గొన్నారు.