ప్రముఖ మరాఠీ నటుడు అతుల్ పర్చురే (57) కన్నుమూశారు. కేన్సర్‌ను జయించి తిరిగి షూటింగ్‌లలో పాల్గొంటున్న ఆయన సోమవారం అకస్మాత్తుగా తుదిశ్వాస విడిచారు. సలామ్-ఎ-ఇష్క్, పార్టనర్, ఆల్ ది బెస్ట్: ఫన్ బిగిన్స్, ఖట్టా మీఠా, బుద్ధ హోగా తేరా బాప్ వంటి హిందీ చిత్రాలలో ఆయన నటించారు. మరాఠీ నాటకాలలో తన పాత్రలతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. ఆయన మృతితో మరాఠీ చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది.