మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇటీవల విజయవాడలో రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కర్రోతు బంగారు రాజుకు గురువారం విజయనగరం జిల్లా రాజాపులోవ సమీపంలో ఘనంగా ఆహ్వానించారు. అనంతరం నెల్లిమర్ల మండలం నాతవలసలో ఆయనకు కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీ భరత్ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.