సాలూరు: ఆధార్ కేంద్రాల సంఖ్యను తక్షణమే పెంచాలి
పాచిపెంట మండలంలో ఆధార్ కేంద్రాల సంఖ్య పెంచాలని మంగళవారం పలు ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేశారు. మండలంలో 28 పంచాయతీలు ఉండగా 18 పంచాయతీ ప్రజలు ఏజన్సీలో ఉంటున్నారు. కానీ సాలూరు పట్టణానికి దగ్గరగా పణుకువలస ప్రాంతానికి ఆధార్ కేంద్రం కేటాయించడంతో ఏజన్సీ ప్రాంతాలకు కష్టమవుతుందన్నారు. ఈ మేరకు ఏజన్సీ ప్రాంతానికి కూడా ఆధార్ కేంద్రం కేటాయించాలని కోరుతున్నారు.