బావిలో పడి ఇద్దరు గిరిజనులు మృతి
పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. బొడ్డపాడు సమీపంలోని బావిలో పడి ఇద్దరు గిరిజన యువతులు మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.