బోథ్ మండలంలో పెద్దపులి కలకలం రేపింది. మండలంలోని ఘన్ పూర్ గ్రామ శివారులోని అడవి సమీపంలో శనివారం ఉదయం ఓ జింకపై పులి దాడి చేసి చంపేసింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు తొందరగా పులిని పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు.