పార్వతీపురం: కిశోర వికాసంపై విస్తృత ప్రచారం

70చూసినవారు
పార్వతీపురం: కిశోర వికాసంపై విస్తృత ప్రచారం
బాలికల్లో రక్తహీనత నివారించే కిశోర వికాసం కార్యక్రమంపై విస్తృత ప్రచారం చేయాలని ఐసిడిఎస్‌ పీడీ ఎంఎస్‌ రాణి కోరారు. సోమవారం పార్వతీపురం ఎంపిడిఒ కార్యాలయంలో ఐసిడిఎస్‌ పిఒ శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. 11 నుంచి 18 ఏళ్ల బాలికలు చదువుపై దృష్టి పెట్టేలా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. 18 ఏళ్లు నిండకుండా పెళ్లి చేసుకోకూడదని చెప్పారు.

సంబంధిత పోస్ట్