వేపాడ: విద్యార్థులకు యూనిఫామ్ లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

75చూసినవారు
వేపాడ మండలం అరిగి పాలెం ఎంపీపీ పాఠశాలలో ఆర్కే విద్యాసంస్థలు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన విద్యార్థులకు యూనిఫాం పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పాల్గొన్నారు. ఈ మేరకు ఆమె విద్యార్థినీ విద్యార్థులకు ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. విద్యార్థినీ విద్యార్థులు చదువుపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి అధికారి గొంప కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్