వేపాడ: పాటురులో ధనుర్మాసం వేడుకలు
వేపాడ మండలం పాటూరు గ్రామంలో వేంచేసియున్న పురాతన శ్రీ జనార్ధన స్వామివారి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవ వేడుకల సందర్భంగా బుధవారం ధనుర్మాసం మూడవ రోజు గ్రామ పురవీధులలో భక్తులు హరి నామ సంకీర్తనలతో నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు చలి తీవ్రతను భరిస్తూ భక్తిశ్రద్దలతో హరినామంతో నగర సంకీర్తన గావించారు.