విజయనగరం జిల్లాలో విషాదం.. ఒకరు మృతి
తెర్లాం మండలం అంట్లవారి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కోట రామారావు అనే వ్యక్తి విద్యుత్ షాకుకు గురై బుధవారం మరణించారు. స్థానికుల వివరాల ప్రకారం, రామారావు పొలానికి వెళ్తుండగా సడన్గా విద్యుత్ వైర్లు తాకి, షాక్తో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సర్వీస్ వైర్ తెగిపడటం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఎస్ఐ సాగర్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.