విశాఖ: పోలీస్ కమీషనర్ ను కలిసిన వీఎంఆర్డీఏ చైర్మన్
వీఎంఆర్డీఏ చైర్మన గా భాద్యతలు చేపట్టిన ఎంవి ప్రణవ్ గోపాల్ మొదటి సారిగా విశాఖ పోలీసు కమిషనర్ శంఖబ్రత బగ్చిని మర్యాద పూర్వకంగా కలిశారు. బుధవారం ఆయన ఛాంబర్ కి వెళ్లి సీపీతో భేటీ అయ్యారు. సంస్థకు చెందిన పార్కులు, పర్యాటక ప్రాంతాలను సందర్శనీయ ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, నిఘాను మరింత పెంచాలని కోరారు.