Sep 19, 2024, 00:09 IST/
16 ఏళ్లుగా ఓ వ్యక్తి గుండెకు సమీపంలో ఉన్న బుల్లెట్‌ను తొలగించిన ఢిల్లీ వైద్యులు
Sep 19, 2024, 00:09 IST
16 ఏళ్ల క్రితం వ్యక్తి శరీరంలో, గుండెకు సమీపంలో దిగిన బుల్లెట్‌ను ఢిల్లీలోని ఓ ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్ చేసి తొలగించారు. 2008లో బుల్లెట్ దిగగా గతేడాది వరకు ఆ వ్యక్తి ఆరోగ్యంగానే ఉన్నాడు. కానీ ఆ తర్వాత అతడికి ఛాతిలో నొప్పి పెరిగి, దగ్గులో రక్తం పడటం ప్రారంభమైందని వైద్యులు తెలిపారు. దీంతో సర్జరీ చేసి ఉపిరితిత్తిలో పాడైన భాగాన్ని కూడా తొలగించారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు.