Sep 14, 2024, 04:09 IST/
రైతులకు పెద్ద ఉపశమనం.. ఉల్లిపాయలపై కనీస ఎగుమతి ధరను తొలగించిన ప్రభుత్వం
Sep 14, 2024, 04:09 IST
ఉల్లి ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కనీస ఎగుమతి ధర(MEP) నిబంధనను ఎత్తివేసింది. విదేశాలకు ఎగుమతి చేసే ఉల్లిపాయలకు కనీస ఎగుమతి ధర నిబంధనను శుక్రవారం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ రద్దు చేసింది. గతంలో విధించిన నిబంధన ప్రకారం ఉల్లిని ఎగుమతి చేయాలంటే, టన్నుకు కనీసం 550 డాలర్లు ధర ఉండాలి. అంటే అంతకంటే తక్కువ ధరకు ఎగుమతి చేయకూడదు. ఇప్పుడు MEP తొలగింపు ఉల్లి ఎగుమతులకు ప్రోత్సాహన్నిస్తుంది.