గొలుగొండ: వరి కోతలను వాయిదా వేసుకోవాలి
ఈ నెల 18 నుంచి 21 వరకు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మండలంలోని వరి రైతులు వరి కోతలను, నూర్పులను వాయిదా వేసుకోవాలని గొలుగొండ మండల వ్యవసాయాధికారి కే. సుధారాణి మంగళవారం తెలిపారు. ఇప్పటికే కోసిన వరి పంటను కుప్పలుగా పెట్టుకొని టార్పాలిన్లు కప్పాలని సూచించారు. ఈ మూడు రోజులు రైతులు అప్రమత్తంగా ఉండి తమ పంటను కాపాడుకోవాలని చెప్పారు.