నాతవరం: ఎన్నికైన వారికి అభినందనలు తెలియజేసిన నేతలు
నాతవరం తాండవ ప్రాజెక్టు డిసి-1 అధ్యక్షుడుగా పారుపల్లి వరహాలబాబు ఎన్నికయ్యారు అలాగే డిస్-2 అధ్యక్షులుగా మేడపరెడ్డి జోగుబాబు, డీసీ-3 అధ్యక్షులుగా లోకవరపు కుల్లయ్య నాయుడు (బాబులు) ఎన్నికయ్యారు రిటర్నింగ్ అధికారి వివి. రమణ ధ్రువీకరణ పత్రాలను మంగళవారం అందించారు. ఈ కార్యక్రమంలో నాతవరం మండల పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ, మాజీ ఎంపీపీలు పారుపల్లి కొండబాబు, సింగంపల్లి సన్యాసిదేముడు పాల్గొన్నారు.