AP: సచివాలయంలో నేడు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. 'రాజకీయ ఒత్తిళ్లు ఉన్న పరిపాలన గాడి తప్పకూడదు. ప్రజలు మమ్మల్ని విశ్వసించి భారీ విజయం కట్టబెట్టారు.. వారు ప్రభుత్వం నుంచి చాలా ఆశిస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే పాలసీలను తీసుకొస్తాం.. వాటిని ప్రజల వద్దకు తీసుకెళ్లేది అధికారులే. అందుకే అధికారులు బాధ్యతగా పనిచేయాలి' అని అన్నారు.