సోమవారం జరిగే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. సుమారు 30 బస్సులు విశాఖలోని వివిధ ప్రాంతాల నుంచి మధురవాడ క్రికెట్ స్టేడియం కు వెళ్లేందుకు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రత్యేక బస్సులు గాజువాక, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్, సింహాచలం, కూర్మన్నపాలెం నుంచి స్టేడియంకు వెళ్తాయి. రద్దీని బట్టి బస్సుల సంఖ్యను పెంచడం లేదా తగ్గించడం చేస్తామని రిజినల్ మేనేజర్ అప్పలనాయుడు తెలిపారు.