జనసేన గ్లాసు గుర్తు ఆకారంలో పెళ్లి పత్రిక.. ఫోటో వైరల్

583చూసినవారు
జనసేన గ్లాసు గుర్తు ఆకారంలో పెళ్లి పత్రిక.. ఫోటో వైరల్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమాని ఆ పార్టీ గుర్తు ‘గాజు గ్లాసు’ ఆకారంలో పెళ్లి పత్రికను ముంద్రించాడు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం మెట్టవలస గ్రామానికి చెందిన అడబాల నాగేశ్వరరావు.. పవన్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. గాజు ఆకారంలో పెళ్లి పత్రికను ముద్రించి.. పవన్, చిరంజీవి ఫోటోలను ప్రింట్ చేయించాడు. ఈ శుభలేఖ నెట్టింట వైరల్ అవుతోంది.