IAF మాజీ చీఫ్ ఫ్యామిలీకి ఊహించని పరిణామం

81చూసినవారు
IAF మాజీ చీఫ్ ఫ్యామిలీకి ఊహించని పరిణామం
పుణెలో ఓటు వేసేందుకు వెళ్లిన భారత వాయుసేన మాజీ చీఫ్ ప్రదీప్ వసంత్ నాయక్ కుటుంబానికి ఊహించని పరిణామం ఎదురైంది. ఓటర్ లిస్టులో తన భార్య పేరు లేదని తెలిసి ఆయన ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. స్థానిక నేతలు ఇచ్చిన ఓటర్ స్లిప్పులున్నా కూడా లిస్టులో పేరు లేకపోవడానికి గల కారణాలను గుర్తించాలని ఆయన అన్నారు. ఓటర్ల పేర్లు తొలగించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్