పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలంలోని రాయలం గ్రామాన్ని మోడరన్ ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని, స్వచ్ఛమైన తాగునీరును అందిస్తామని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా బుధవారం రాయలంలో సుమారు రూ 60 లక్షలతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఐదేళ్లలో గ్రామం అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు.