తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

50చూసినవారు
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదలయ్యాయి. డిసెంబర్‌ నెలకు సంబంధించిన ఆర్జిత దర్శనాల ఆన్‌లైన్‌ కోటాను విడుదల చేశారు. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ కోసం ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు నమోదుకు అవకాశం కల్పించారు. ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను విడుదల చేస్తారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో సేవా టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్