వరద నీరు ప్రజారోగ్యానికి సవాళ్లు విసురుతోంది. అసాధారణ రీతిలో తొమ్మిది రోజుల నుంచి నిల్వ ఉన్న బురద నీటివల్ల సంక్రమిత వ్యాధులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పారుదల జరగకుండా ఉన్న నీటి ద్వారా వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ సంబంధిత వ్యాధులు పెరిగే అవకాశం ఉంది. వీటిని నియంత్రించే చర్యల్లో భాగంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బృందాలు ఇప్పటికే ఇంటింటి సర్వేను చేపట్టి ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తున్నాయి. వర్షాలకు తగ్గట్లు వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి.