స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో గురువారం వివిధ ప్రభుత్వ శాఖలు సాధించిన ప్రగతిని తెలియజేస్తూ ప్రదర్శించిన శకటాల ప్రదర్శన ప్రజలను ఆకట్టుకున్నాయి. పోలీసు, వ్యవసాయం, జిల్లా గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ సంస్థ, వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, తదితర శాఖలు చేపడుతున్న కార్యక్రమాలపై రూపొందించిన శకటాలు ప్రజలను ఆసక్తిగా తిలకించారు.