దేవరపల్లి మండల మానవతా గౌరవ అధ్యక్షులు కేశిరాజు సీతారామయ్య 85వ పుట్టినరోజు సందర్భంగా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం సీతారామయ్య భారతి దంపతులతో మానవతా సంస్థ సభ్యులు కేక్ కట్ చేయించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండల మానవతా సంస్థ అధ్యక్షులు బండి సూర్య ప్రకాష రావు మాట్లాడుతూ సంస్థ సీనియర్ సభ్యులు కేశిరాజు సీతారామయ్య మానవతా స్వచ్ఛంద సంస్థకు ఫ్రీజర్ మరియు ప్రతినెల 3000 రూపాయలు సంస్థకు అందజేస్తున్నారని, ట్రాఫిక్ రూల్స్ సూచిక బోర్డు లను ఏర్పాటు చేస్తున్నారని సంస్థ ద్వారా ఆయన చేస్తున్న సేవలు ఎనలేనివని ఆయన కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మానవతా చైర్మన్ బలుసు సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు బళ్ళ సూర్యచక్రం, కేశిరాజు రాజకుమార్, పప్పు వెంకట రామారావు, డాక్టర్ కె. కాశీ విశ్వనాథం, జిల్లా రైతు నాయకులు ఉండవల్లి కృష్ణారావు, మానవతా మండల కార్యదర్శి ఈడ్పుగంటి నాగేశ్వరరావు, కోశాధికారి తీగెల రాజా, యలమాటి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.