మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా స్మార్థకార్థం అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఆయన గౌరవార్థం పరిశ్రమలో విశేష కృషి చేస్తున్న వారికి ప్రభుత్వం తరపున ‘రతన్ టాటా ఉద్యోగ రత్న అవార్డు’ ఇవ్వనున్నట్లు పరిశ్రమలశాఖ మంత్రి ఉదయ్ సమంత్ తెలిపారు. అలాగే, ముంబైలోని ఉద్యోగ్ భవన్‌కు రతన్ టాటా ఉద్యోగ్ భవన్‌గా పేరు మారుస్తున్నట్లు పేర్కొన్నారు.