సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్‌కు ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి లభించింది. మానవ జీవితపు దుర్బలత్వాన్ని చారిత్రక విషాదాలను ఆమె తన గద్య కవిత్వంతో కళ్లకు కట్టారని స్వీడిష్ అకాడమీ పేర్కొంది. అంతకుముందు ఏడాది (2023) నార్వేకు చెందిన రచయిత జాన్ ఫోసె అందుకున్నారు.