మంచినీటి పథకం పునరుద్ధరణ కొరకు కృషి చేసిన కార్మికులు

1350చూసినవారు
మంచినీటి పథకం పునరుద్ధరణ కొరకు కృషి చేసిన కార్మికులు
గోపాలపురం: 243 గ్రామాలు ఐదు లక్షల మంది ప్రజల దాహార్తి 145 కుటుంబాల జీవన ఆధారం ఇది గోదావరి సత్యసాయి మంచినీటి పథకం యొక్క విశిష్టత. కాని గత 14 నెలల క్రితం ప్రభుత్వం పథకం యొక్క నిర్వహణ నిధులు మంజూరు చేయకపోవడంతో మూత పడింది. అప్పటినుండి సత్య సాయి మంచినీటి పథకం కార్మికులు ప్రాజెక్టు పునరుద్ధరణ కొరకు అనేక ఉద్యమాలు చేసి అధికార ప్రతిపక్ష పార్టీలతో పాటు వివిధ పార్టీలు ప్రజలు స్వచ్ఛందంగా వివిధ రూపాలలో కార్మికులకు తమ సంఘీభావం తెలిపారు. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి పధక నిర్వహణకు నిధులు మంజూరు చేయడంతో సత్య సాయి మంచినీటి పథకం పునరుద్ధరిస్తున్నట్లు ప్రజలు కార్మికులు ఎంతో ఆశపడ్డారు. కానీ నిధులు విడుదలై సుమారు మూడు నెలలు కావచ్చినప్పటికీ నిర్వహణకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో సత్యసాయి మంచినీటి పథకం పూర్తిగా మూతపడినట్లేనని భావించారు. సంబంధిత పథకంలో పనిచేస్తున్న గోపాలపురం కు చెందిన దాసరి రవి, ఇందుకూరుపేటకు చెందిన కంకిపాటి రామచంద్రుడు ఇద్దరు సత్యసాయి మంచినీటి పథకం కార్మికులు సమస్యను తమ భుజాన వేసుకుని కాంట్రాక్టర్ తో మాట్లాడి అనేక సమస్యలను అధిగమించి లక్షలాది మంది ప్రజల దాహార్తిని తీర్చడంతోపాటు 145 మంది కార్మికులకు ఉద్యోగాలు కల్పించిన ఘనత వీరిదేనని సత్యసాయి కార్మికులు హుకుంపేట మంచినీటి పథకం ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద ఘనంగా పూలమాలతో సాలువ కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన సత్య మంచినీటి పథకం కార్మికులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్