పేదలకు ఉచితంగా వైద్యం అందించే ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన వైఎస్సార్ ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డుల పంపిణీ చురుగ్గా సాగుతోందని ఉంగుటూరు పంచాయతీ కార్యదర్శి కేవీ గిరిధర్ శనివారం తెలిపారు. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ డిజిటల్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డులు కోసం తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలన్నారు. గ్రామ వలంటీర్లు మీ వద్దకే వచ్చి ఈ కార్డులు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.