చింతలపూడిలో టిడిపి విస్తృత ప్రచారం
చింతలపూడి నగర పంచాయతీ పరిధిలోని పాత చింతలపూడి గ్రామంలో టౌన్ టీడిపి ప్రధాన కార్యదర్శి బోడ నాగభూషణం ఆధ్వర్యంలో బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలో ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి అభివృద్ధి సంక్షేమానికి నాంది పలకాలని సూచించారు.