జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీనివాస సామిల్లులో పని చేసే చరణ్ మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా మృతుడి కుటుంబానికి రూ. 30 లక్షలు నష్టపరిహారం అందించాలని జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రి మార్చురీ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. దీనిపై యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. దీనిపై లక్కవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.