చింతలపూడి నియోజకవర్గంలో సీఎం ఆదేశాలతో ఇంటి నిర్మాణం కోసం ఎమ్మెల్యే రోషన్ కుమార్ శనివారం శుభవార్త తెలియజేశారు. గ్రామా పంచాయతీలో ఉన్న కాలువ రేవుల్లో ఇసుకను ట్రాక్టర్లు, ఎడ్లబండ్ల ద్వారా ఇంటి నిర్మాణం కోసం తీసుకువెళ్లొచ్చని వాటిని పోలీసులు రెవెన్యూ అధికారులు అడ్డుకోవద్దని ఆదేశాలు జారీ చేశారు. అయితే దీన్ని అదునుగా చూసుకుని ఇసుక దందా చేస్తే మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు.