Nov 23, 2024, 14:11 IST/
TG: టెన్త్ పాసైన వారికి గుడ్ న్యూస్
Nov 23, 2024, 14:11 IST
TG: డిసెంబర్ 8 నుంచి 16 వరకు హైదరాబాద్లో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయని చెప్పారు. జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, స్టోర్ కీపర్ పోస్టులకు పదో తరతి అర్హతగా ఉండాలని పేర్కొన్నారు. 17 నుంచి 21 ఏళ్ల వయస్సు ఉండాలని సూచించారు. సందేహాలు ఉంటే 040-27740059కు కాల్ చేయొచ్చని పేర్కొన్నారు.